News November 18, 2024
BGTకి సరికొత్త అవతారంలో పుజారా!
‘మోడర్న్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’గా పేరొందిన పుజారా కొత్త అవతారమెత్తనున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న BGTలో ఆయన స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది. టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్సులు ఆడిన పుజారా గత కొంత కాలంగా ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యారు. ఇటీవల దేశవాళీలో సత్తా చాటినా ఆయనను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. పుజారా భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు.
Similar News
News November 18, 2024
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ చీఫ్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆయనను నియమించారు.
News November 18, 2024
‘పుష్ప-2’ ట్రైలర్‌పై వార్నర్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్
మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప’ మేనరిజంతో ప్రతి ఇండియన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజవడంతో ‘చాలా బాగుంది బ్రదర్’ అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. దీనికి అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ ‘ఎంతో ప్రేమతో.. మీకు ధన్యవాదాలు ’ అని రిప్లై ఇచ్చారు. దీంతో డిసెంబర్ 5న FDFS చూసేందుకు HYDకి రావాలని నెటిజన్లు వార్నర్‌ను కోరుతున్నారు.
News November 18, 2024
నేడు కడప దర్గాకు రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకానున్నారు. దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట మేరకు ఆయన మాలలో ఉన్నప్పటికీ దర్గాకు వెళ్తున్నారు. చరణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం చరణ్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.