News November 18, 2024

PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం

image

PDS ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌ర‌ఫ‌రా చేసిన ఆహార ధాన్యాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌డంతో ₹69 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎకాన‌మిక్ థింక్ ట్యాంక్ అధ్య‌య‌నంలో తేలింది. 28% లబ్ధిదారుల‌కు ధాన్యం చేర‌డం లేద‌ని వెల్ల‌డైంది. ఆగ‌స్టు, 2022-జులై, 2023 మ‌ధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్య‌య‌నం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇత‌ర ఎగుమ‌తుల‌కు మ‌ళ్లించివుంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Similar News

News November 18, 2024

మణిపుర్ మంటలు: రిజైన్ చేయనున్న CM బిరేన్‌?

image

మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM బిరేన్‌సింగ్ పదవిని వీడే అవకాశం ఉంది. లేదా బలవంతంగా ఆయనతో రాజీనామా చేయిస్తారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆయన BJP MLAలతో సమావేశం అవుతున్నారు. ఇందులో అనూహ్య నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే కాన్‌రాడ్ సంగ్మా నాయకత్వంలోని NPP ప్రభుత్వం నుంచి తప్పుకుంది. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్ల దాడులతో రాష్ట్రంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే.

News November 18, 2024

జగనన్న కాలనీలపై విచారణ చేపట్టండి: స్పీకర్ ఆదేశం

image

AP: వైసీపీ హయాంలో ప్రారంభించిన జగనన్న కాలనీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ జగనన్న ఇళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.

News November 18, 2024

గాలి కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది మృతి!

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.