News November 18, 2024
PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం
PDS ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసిన ఆహార ధాన్యాలు పక్కదారి పట్టడంతో ₹69 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఎకానమిక్ థింక్ ట్యాంక్ అధ్యయనంలో తేలింది. 28% లబ్ధిదారులకు ధాన్యం చేరడం లేదని వెల్లడైంది. ఆగస్టు, 2022-జులై, 2023 మధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్యయనం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇతర ఎగుమతులకు మళ్లించివుంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News December 11, 2024
శ్రేయా ఘోషల్ భర్త గురించి తెలుసా?
మెలోడియస్ సింగర్ శ్రేయా ఘోషల్ భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన రూ.వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ యాప్ ‘ట్రూకాలర్’ కంపెనీకి గ్లోబల్ హెడ్. ముంబై యూనివర్సిటీలో బీఈ(ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసిన ఆయన పలు కంపెనీల్లో పనిచేసి 2022 నుంచి ట్రూకాలర్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. కాగా, 12సార్లు నేషనల్ అవార్డు పొందిన శ్రేయా నికర ఆదాయం రూ.240 కోట్లు అని సినీ వర్గాలు తెలిపాయి.
News December 11, 2024
ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
News December 11, 2024
సియారామ్ బాబా.. ఇక లేరు
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సియారామ్ బాబా ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన కడసారి చూపు కోసం మధ్యప్రదేశ్‌లోని భట్యాన్‌లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రామచరిత మానస్ పఠిస్తూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. నర్మదా నది ఘాట్లను ఆయన ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు.