News November 18, 2024
మణిపుర్ కేసులు స్వీకరించిన NIA

మణిపుర్‌లో హింసకు కారణమైన మూడు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను NIA స్వీకరించింది. జిరిబమ్‌లో CRPF, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు, ఒకే కుటుంబంలోని ఆరుగురిని కిడ్నాప్ చేయడం, వారిని చంపేసిన కేసులను రాష్ట్ర పోలీసులు ఆ సంస్థకు బదిలీ చేశారు. మణిపుర్‌లో హింసకు దారితీసిన పరిస్థితులు, శాంతి భద్రతల ప్రభావంపై NIA దర్యాప్తు చేయనుంది. పరిస్థితుల నియంత్రణకు కేంద్రం మరో 2వేల CAPF అధికారులను మోహరిస్తోంది.
Similar News
News September 17, 2025
మోదీ బయోపిక్.. పోస్టర్ రిలీజ్

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘మా వందే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. పోస్టర్‌పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఉండగా.. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు.
News September 17, 2025
GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.