News November 18, 2024

మణిపుర్ కేసులు స్వీకరించిన NIA

image

మణిపుర్‌లో హింసకు కారణమైన మూడు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను NIA స్వీకరించింది. జిరిబమ్‌లో CRPF, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు, ఒకే కుటుంబంలోని ఆరుగురిని కిడ్నాప్ చేయడం, వారిని చంపేసిన కేసులను రాష్ట్ర పోలీసులు ఆ సంస్థకు బదిలీ చేశారు. మణిపుర్‌లో హింసకు దారితీసిన పరిస్థితులు, శాంతి భద్రతల ప్రభావంపై NIA దర్యాప్తు చేయనుంది. పరిస్థితుల నియంత్రణకు కేంద్రం మరో 2వేల CAPF అధికారులను మోహరిస్తోంది.

Similar News

News March 7, 2026

BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 7, 2026

సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

image

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.

News March 7, 2026

రాజకీయాల్లోకి త్రిష?

image

TVK చీఫ్ విజయ్‌‌-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.