News November 18, 2024
అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: మంత్రి సంధ్యారాణి
AP: అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 18, 2024
అది మంచి పద్ధతి కాదు: RBI గవర్నర్ వార్నింగ్
బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్‌లో లాభపడినా లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారని హెచ్చరించారు. KYC వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్ సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావులేకుండా స్టాఫ్ ఇన్సెంటివ్స్‌ను రూపొందించాలని సూచించారు.
News November 18, 2024
లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్
TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్‌ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్‌లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.
News November 18, 2024
ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత.. కారణం ఇదే
AP: గత మూడు దశాబ్దాల్లో జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిందని.. జనన, మరణాల నిష్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిందని పేర్కొంది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉందని తెలిపింది. అందుకే తాజాగా స్థానిక ఎన్నికల్లో <<14644385>>ఎంత మంది పిల్లలు<<>> ఉన్నా పోటీకి అర్హత కల్పిస్తున్నట్లు వివరించింది.