News November 18, 2024
అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: మంత్రి సంధ్యారాణి
AP: అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 14, 2024
కంగ్రాట్స్ గుకేశ్: ఎలాన్ మస్క్
ప్రపంచ విజేతగా నిలిచిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజుకు వివిధ రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలుపగా తాజాగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ‘కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. 18 ఏళ్లకే 18వ వరల్డ్ ఛాంపియన్ అని గుకేశ్ చేసిన ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు.
News December 14, 2024
రైతు రుణాలు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే <<14805545>>లోన్ లిమిట్ రూ.2 లక్షలకు<<>> పెంచగా జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది.
News December 14, 2024
బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది : RGV
హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.