News November 18, 2024

అప్పట్లో గంభీర్ వార్నింగ్.. ఇప్పుడు గంగూలీ మద్దతు

image

BGT సిరీసులో రవిచంద్రన్ అశ్విన్‌ను తొలి టెస్టు నుంచే ఆడించాలని BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. అతడిని బెంచ్‌పై కూర్చోబెట్టొద్దని సూచించారు. ‘చర్చే లేదు. టెస్టు క్రికెట్లో స్పెషలిస్టులే కీలకం. అందుకే టీమ్ బెస్ట్ స్పిన్నర్ అశ్విన్ ఆడాల్సిందే. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న ఆసీస్‌పై అతడే ప్రభావం చూపగలడు’ అని అన్నారు. గతంలో కొన్ని మ్యాచులకు యాష్‌ను తప్పించడంపై గంభీర్ హెచ్చరించడం తెలిసిందే.

Similar News

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.