News November 18, 2024
అప్పట్లో గంభీర్ వార్నింగ్.. ఇప్పుడు గంగూలీ మద్దతు
BGT సిరీసులో రవిచంద్రన్ అశ్విన్‌ను తొలి టెస్టు నుంచే ఆడించాలని BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నారు. అతడిని బెంచ్‌పై కూర్చోబెట్టొద్దని సూచించారు. ‘చర్చే లేదు. టెస్టు క్రికెట్లో స్పెషలిస్టులే కీలకం. అందుకే టీమ్ బెస్ట్ స్పిన్నర్ అశ్విన్ ఆడాల్సిందే. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న ఆసీస్‌పై అతడే ప్రభావం చూపగలడు’ అని అన్నారు. గతంలో కొన్ని మ్యాచులకు యాష్‌ను తప్పించడంపై గంభీర్ హెచ్చరించడం తెలిసిందే.
Similar News
News December 10, 2024
స్పామ్ కాల్స్ బెడద.. తెలుగు స్టేట్స్ టాప్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పామ్ కాల్స్ ఇబ్బందిగా మారాయి. ఎయిర్‌టెల్ స్పామ్ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా స్పామ్ కాల్స్ గుర్తించిన రాష్ట్రాల్లో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా పురుషులు(76%), అందులోనూ 36-60 ఏళ్ల మధ్యనున్న వారినే టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్పామ్ కాల్స్ రోజూ ఉదయం 11 నుంచి 3PM వరకు వస్తాయని తెలిసింది. వీకెండ్స్‌లో తక్కువగా కాల్స్ వస్తాయని వెల్లడైంది.
News December 10, 2024
పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతున్నారా..
పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవించడం చాలామందికి అలవాటు. దానిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాపర్, అల్యూమినియం గ్లాసుల్లో దీనిని తీసుకోవద్దు. పులుపు ఆ లోహాలను కరిగిస్తుంది. దాంతో అవి రక్తంలో కలవొచ్చు. చర్మ సమస్యలుంటే పుల్లని పానీయాలు తీసుకోవద్దు. ఎసిడిటీ ఉంటే అది మరింత ఎక్కువ కావొచ్చు. లెమన్ వాటర్‌ను వెంటనే తాగకపోతే విటమిన్-సి తగ్గిపోవచ్చు.
News December 10, 2024
మా కుటుంబ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంచు విష్ణు
తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా, ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో <<14837635>>కేసులు నమోదైన<<>> సంగతి తెలిసిందే.