News November 18, 2024

APSRTCలో 2,064 ఖాళీలు: మంత్రి మండిపల్లి

image

APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.

Similar News

News November 18, 2024

లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

News November 18, 2024

బుల్డోజర్ సిద్ధంగా ఉంది: యోగి

image

‘బుల్డోజర్ న్యాయం’ సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే UP CM యోగి మళ్లీ అలాంటి కామెంట్స్ చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘సోరెన్ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టింది. వాటిని రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉంది. బంగ్లా వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. వీరి వల్ల బేటీ, మటీ, రోటీ(కూతురు, భూమి, రొట్టె)కి ముప్పు ఏర్పడింది’ అని చెప్పారు.

News November 18, 2024

DEC 21న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా DEC 21న GST కౌన్సిల్ 55వ సమావేశం జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు/UTల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST మినహాయింపుపై(ప్రస్తుతం 18%) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, నోట్‌బుక్స్‌పై GSTని 5 శాతానికి తగ్గించడంపై చర్చిస్తారు.