News November 18, 2024
RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం
దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
Similar News
News November 18, 2024
రేపు వరంగల్‌కు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే!
TG: CM రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30కు వరంగల్ చేరుకొని, రోడ్డు మార్గాన ఆర్ట్స్ కాలేజీకి వెళ్తారు. 3.20-3.50వరకు ఇందిరా మహిళా స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం కాలేజీ గ్రౌండ్‌లోని వేదికపైకి చేరుకొని 22జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆపై ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను ప్రారంభించి, 4.40 తర్వాత CM ప్రసంగిస్తారు.
News November 18, 2024
బైడెన్‌ను కలిసిన మోదీ
బ్రెజిల్ రాజధాని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు. ఈ ఫొటోను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్‌ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని చెప్పారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. కాగా మోదీ నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్నారు.
News November 18, 2024
స్కూటీపై 8 మంది.. ప్రాణాలతో చెలగాటం
AP: గుంటూరు (D) మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఓ స్కూటీపై 8 మంది ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు. ముందు వైపు ముగ్గురు, వెనక నలుగురితో ప్రయాణించాడు. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని, ఆ వ్యక్తికి కామన్ సెన్స్ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారని, హెల్మెట్ కూడా లేదని ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటని నిలదీస్తున్నారు. ఇతనికి ఎంత ఫైన్ వేయాలి? అని మండిపడుతున్నారు.