News November 18, 2024
RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం

దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
Similar News
News March 7, 2026
రాజకీయాల్లోకి త్రిష?

TVK చీఫ్ విజయ్-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.
News March 7, 2026
CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 7, 2026
28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <


