News November 18, 2024

లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 19, 2024

హైరింగ్ ప్రాసెస్‌లో ఏజ్, జెండర్, పెళ్లి వివరాలు అడగొద్దు: ఫాక్స్‌కాన్

image

ఉద్యోగ నియామక ప్రకటనల్లో ఏజ్, జెండర్, మారిటల్ స్టేటస్, కంపెనీ పేరు తొలగించాలని రిక్రూటింగ్ ఏజెంట్లను ఫాక్స్‌కాన్ ఆదేశించినట్టు తెలిసింది. యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. AC వర్క్‌ప్లేస్, ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్, క్యాంటీన్, ఫ్రీ హాస్టల్ వంటివి పెట్టాలని చెప్పింది. శ్రీపెరంబదూర్‌లోని ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లో ఉద్యోగుల ఎంపిక కోసం థర్డ్‌పార్టీ ఏజెన్సీలను కంపెనీ నియమించుకుంది.

News November 18, 2024

ఢిల్లీలో 12వ తరగతి వరకు ప్రత్యక్ష క్లాసులు బంద్

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతులకు ఫిజికల్ క్లాసెస్ నిలిపివేస్తున్నామని, ఇక నుంచి ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని సీఎం అతిశీ వెల్లడించారు. ఇప్పటికే 9వ తరగతి వరకు క్లాసులను నిలిపివేశారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 493గా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప గాలి నాణ్యత అని అధికారులు చెప్పారు.

News November 18, 2024

మా నాన్న బెల్టు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్

image

తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్‌లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్‌ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.