News November 18, 2024
లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2024
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రానికి CM రేవంత్ విజ్ఞప్తులు
TG: కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను CM రేవంత్ కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రైల్వే ప్రాజెక్టులపై ఢిల్లీలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. VKB-కృష్ణా, కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. డోర్నకల్-మిర్యాలగూడ, డోర్నకల్-గద్వాల రైలు మార్గాలను పునఃపరిశీలించాలని కోరారు.
News December 13, 2024
అల్లు అర్జున్‌తో మిస్ బిహేవ్ చేయలేదు: పోలీసులు
అల్లు అర్జున్‌ను బెడ్ రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని, ఆయనతో తమ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ‘మేము వారి ఇంటికి వెళ్లగానే దుస్తులు మార్చుకోవడానికి అల్లు అర్జున్ టైమ్ అడిగారు. తన బెడ్ రూమ్‌కు వెళ్లారు. పోలీసులు బయటే ఉన్నారు. ఆయన బయటకు వచ్చాకే కస్టడీలోకి తీసుకున్నారు. భార్య, కుటుంబంతో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇచ్చాం’ అని స్పష్టం చేశారు.
News December 13, 2024
రేపు కీలక ప్రకటన: మంచు విష్ణు
మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఓ ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు. తాను చేసే ప్రకటన మనసుకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో విష్ణు ఎలాంటి విషయం వెల్లడించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.