News November 18, 2024

నాడు కుల గణన చేపట్టకపోవడం తప్పే: రాహుల్

image

UPA హయాంలో ప్రతిపాదన వచ్చినప్పుడు కులగణన చేపట్టకపోవడం తప్పేనని LoP రాహుల్ అంగీకరించారు. దాన్ని సరిదిద్దుకోవడానికే TG, కర్ణాటకలో సర్వేలు ఆరంభించామని తెలిపారు. ప్రజలతో చర్చించాకే ప్రశ్నావళి రూపొందించామన్నారు. కాంగ్రెస్-JMM గెలిచాక ఝార్ఖండ్‌లోనూ ఇలాగే చేస్తామన్నారు. BCలపై డేటా లేకపోవడం వల్లే సరైన విధానాలు రూపొందించడం లేదని, న్యాయబద్ధంగా సంపద పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2024

TODAY HEADLINES

image

✒ G20 సమ్మిట్‌లో బైడెన్‌తో మోదీ భేటీ
✒ UPAలో కులగణన చేయకపోవడం తప్పే: రాహుల్
✒ AP: శ్రీవాణి ట్రస్ట్‌ రద్దు.. తిరుమలలో రాజకీయాలపై నిషేధం
✒ AP: అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: సంధ్యారాణి
✒ పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు
✒ AP: భూఅక్రమాలపై విచారణ చేయించండి: బొత్స లేఖ
✒ TG: రైతులు, ఉద్యోగాల విషయంలో PM ఫెయిల్: రేవంత్
✒ TG: దూరదృష్టితో కులగణన: పొంగులేటి
✒ TG: అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR

News November 19, 2024

2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI

image

తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్‌లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.

News November 19, 2024

పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు

image

దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.