News November 18, 2024

నాడు కుల గణన చేపట్టకపోవడం తప్పే: రాహుల్

image

UPA హయాంలో ప్రతిపాదన వచ్చినప్పుడు కులగణన చేపట్టకపోవడం తప్పేనని LoP రాహుల్ అంగీకరించారు. దాన్ని సరిదిద్దుకోవడానికే TG, కర్ణాటకలో సర్వేలు ఆరంభించామని తెలిపారు. ప్రజలతో చర్చించాకే ప్రశ్నావళి రూపొందించామన్నారు. కాంగ్రెస్-JMM గెలిచాక ఝార్ఖండ్‌లోనూ ఇలాగే చేస్తామన్నారు. BCలపై డేటా లేకపోవడం వల్లే సరైన విధానాలు రూపొందించడం లేదని, న్యాయబద్ధంగా సంపద పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

ప్రభుత్వ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు అడగొద్దు: CM

image

AP: ప్రభుత్వాఫీసుల్లో ప్రజల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆపాలని, ప్రస్తుత రోజుల్లో అది ఆమోదయోగ్యం కాదని CM CBN అన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్ వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లతో తిరిగే అవసరం ఉండకూడదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రభుత్వమే కావున వాటిని అన్ని శాఖలు చూడగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవాలన్నారు.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

image

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

News March 12, 2026

టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

image

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.