News November 18, 2024

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. అంతా క్షేమం

image

TG: గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో జయశ్రీ అనే మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఓ ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ఏపీలోని కాకినాడ జీజీహెచ్‌లోనూ తపస్విని అనే మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఇద్దరు ఆడ, ఓ మగ శిశువులు ఉన్నారు.

Similar News

News April 17, 2026

‘కమిటీ సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది’

image

రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించిన నిపుణుల కమిటీ ఛైర్మన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కమిటీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, నివేదిక పారదర్శకంగా, శాస్త్రీయంగా రూపొందిందని చెప్పారు.

News April 17, 2026

జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.

News April 17, 2026

పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.