News November 18, 2024
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. అంతా క్షేమం

TG: గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో జయశ్రీ అనే మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఓ ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ఏపీలోని కాకినాడ జీజీహెచ్‌లోనూ తపస్విని అనే మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఇద్దరు ఆడ, ఓ మగ శిశువులు ఉన్నారు.
Similar News
News March 12, 2026
23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.
News March 12, 2026
ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
News March 12, 2026
ప్రభుత్వ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు అడగొద్దు: CM

AP: ప్రభుత్వాఫీసుల్లో ప్రజల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆపాలని, ప్రస్తుత రోజుల్లో అది ఆమోదయోగ్యం కాదని CM CBN అన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్ వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లతో తిరిగే అవసరం ఉండకూడదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రభుత్వమే కావున వాటిని అన్ని శాఖలు చూడగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవాలన్నారు.


