News November 18, 2024
మా నాన్న బెల్టు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్
తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్‌లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్‌ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2024
13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
TG: రాష్ట్రంలో 13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ తెలిపారు. మరో 57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 7,532 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఓపెన్ మార్కెట్ వల్ల సన్నరకం ధాన్యం సేకరణ తగ్గిందని వివరించారు. ఈ నెల 23వరకు 90శాతం బోనస్ చెల్లిస్తామని చౌహాన్ వెల్లడించారు.
News November 19, 2024
మాజీ హోంమంత్రిపై రాళ్ల దాడి.. తలకు గాయాలు
మహారాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్, NCP-SP నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై రాళ్ల దాడి జరిగింది. కటోల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ తరఫున ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఆయన కారుపై దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆయన తలకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 19, 2024
డ్రాగా ముగిసిన ఇండియా, మలేషియా మ్యాచ్
HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా, మలేషియా మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టైమ్ ముగిసే సరికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత ఫుట్‌బాల్ జట్టుకు ఈ ఏడాది ఇదే లాస్ట్ మ్యాచ్ కాగా, ఈ ఏడాదిలో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. మనోలో మార్క్వెజ్ (స్పెయిన్) హెడ్ కోచ్‌గా నియామకం అయినప్పటి నుంచి 4 మ్యాచులు జరగగా, ఒక్క దాంట్లోనూ IND గెలవకపోవడం గమనార్హం.