News November 18, 2024
మా నాన్న బెల్టు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్

తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్‌లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్‌ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
హీరోయిన్ తమన్నాకు షాక్

స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘పవర్ సోప్స్’ సంస్థతో తన ఒప్పందం(2008-09) ముగిశాక కూడా తన ఫొటోలను 2010-11లో ప్రచారానికి వాడుకున్నారని, ఇది నిబంధనల ఉల్లంఘన అని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందుకు రూ.కోటి పరిహారం ఇప్పించాలని ఆమె విన్నవించుకున్నారు. అయితే దీనివల్ల నటి ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగలేదని, నష్టపరిహారం ఇప్పించడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
News April 16, 2026
యుద్ధం సెగ.. సబ్బుల ధరలకు రెక్కలు!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, సముద్ర మార్గాల్లో రవాణా అడ్డంకులు నిత్యావసరాల ధరలను పెంచేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు భారమవ్వడంతో సబ్బులు, షాంపులు, సర్ఫ్‌లు సహా మరికొన్ని నిత్యావసర వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే HUL తమ లిరిల్, పియర్స్, డవ్ వంటి బ్రాండ్లతో ఉన్న ప్రొడక్ట్స్ ధరలను ₹2-₹3 వరకు పెంచింది.
News April 16, 2026
మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం ఆసన్నమైంది: అర్జున్ మేఘ్వాల్

పార్లమెంటు చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్‌సభలో ఇవాళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయింపును పార్లమెంటు ఆమోదించింది. దీన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.


