News November 19, 2024

ప్రో కబడ్డీ: తెలుగు టైటాన్స్ సూపర్ విక్టరీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో భాగంగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 49-27 తేడాతో ఘనవిజయం సాధించింది. స్టార్ రైడర్ పవన్ షెరావత్ టీమ్‌లో లేకపోయినా విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి ఆరింట్లో గెలవగా, నాలుగింట్లో ఓడింది. ఈనెల 20న యూ ముంబాను ఢీకొట్టనుంది.

Similar News

News January 20, 2026

మూవీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

image

TG: సినిమా టికెట్ ధరల <<18819916>>పెంపుపై<<>> తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. MSVPG టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయమై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, <<18817219>>సీవీ ఆనంద్‌<<>>కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇకపై మూవీ టికెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

News January 20, 2026

రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

image

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్‌షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.

News January 20, 2026

ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ: కేటీఆర్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుంది సిట్ విచారణ కాదని చిట్టి విచారణ అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలను విచారణ, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారన్నారు. నైనీ బ్లాక్ రద్దు వెనక వాటాల పంచాయితీ ఉందని ఫైరయ్యారు.