News November 19, 2024
ప్రో కబడ్డీ: తెలుగు టైటాన్స్ సూపర్ విక్టరీ
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో భాగంగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 49-27 తేడాతో ఘనవిజయం సాధించింది. స్టార్ రైడర్ పవన్ షెరావత్ టీమ్‌లో లేకపోయినా విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడి ఆరింట్లో గెలవగా, నాలుగింట్లో ఓడింది. ఈనెల 20న యూ ముంబాను ఢీకొట్టనుంది.
Similar News
News December 11, 2024
రియాలిటీ షో కోసం రూ.118 కోట్లు ఖర్చు!
యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ కొత్త రియాలిటీ షో నిర్వహించనున్నారు. అమెజాన్‌తో కలిసి ఆయన ‘బీస్ట్ గేమ్స్’ పేరుతో కొత్త రియాలిటీ షో కోసం సెట్ నిర్మించేందుకు $14 మిలియన్స్ (రూ.118 కోట్లు) వెచ్చించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు సమాచారం. రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.
News December 11, 2024
మా నాన్న దేవుడు: మనోజ్
TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
News December 11, 2024
జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు
సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.