News November 19, 2024
ప్రభుత్వ ప్రోత్సాహం.. ఒక్కరోజే 131 ఈవీల కొనుగోలు
TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.
Similar News
News November 19, 2024
ఫ్రీబీస్‌తో హిమాచల్ దివాలా: నెక్ట్స్ AP, TG?
విద్యుత్ కంపెనీల బకాయిలు తీర్చేందుకు భవనాలను వేలం వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ దుస్థితి TG, AP, కర్ణాటక, కేరళను భయపెడుతోంది. అక్కడిలాగే ఇక్కడా ఉచితాలు అమలు చేయడం తెలిసిందే. పరిమితికి మించి అప్పులు చేయడమే కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసేలా పథకాల పెట్టాయి. కొత్త ఆదాయం లేకపోవడంతో సెస్సుల రూపంలో పన్నులు వేస్తున్నాయి. పరిస్థితి మారకుంటే కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరేమంటారు?
News November 19, 2024
అత్యాచారం కేసులో నటుడికి ముందస్తు బెయిల్
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్దిఖ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అత్యున్నత ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించి, విచారణకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు సిద్దిఖ్పై ఫిర్యాదు చేయడానికి 8 ఏళ్లు ఎందుకు పట్టిందని బాధితురాలి లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. కాగా సిద్దిఖ్ తనపై 2016లో అత్యాచారం చేశాడని ఓ నటి ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేశారు.
News November 19, 2024
మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
తాము అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు అమెరికా ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా మండిపడింది. తమ దేశం పైకి క్షిపణులు వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాటో దేశాలకు విస్తరిస్తుందనే ఆందోళన నెలకొంది. పౌరులు నిత్యావసరాలు, ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని నార్వే, ఫిన్లాండ్ సూచించాయి.