News November 19, 2024

ప్రభుత్వ ప్రోత్సాహం.. ఒక్కరోజే 131 ఈవీల కొనుగోలు

image

TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.

Similar News

News December 9, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఏడాది పాలనలో రికార్డు సృష్టించిన కాంగ్రెస్: రేవంత్
* తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్పు మూర్ఖపు చర్య: కేసీఆర్
* యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి పొంగులేటి
* కాంగ్రెస్ ఏర్పాటు చేసేది ఢిల్లీ తల్లిని: కేటీఆర్
* AP: ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: CBN
* కూటమి ప్రభుత్వం స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: జగన్
* BGT: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

News December 9, 2024

Alarm Bells: ఫోన్ల‌కు అతుక్కుపోతున్నారు

image

సంబంధాలు దెబ్బ‌తిన‌డానికి స్మార్ట్ ఫోన్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఓ స‌ర్వేలో తేలింది. 73% పేరెంట్స్, 69% పిల్ల‌లు ఈ విష‌యాన్ని అంగీక‌రిస్తున్నారు. గ్యాడ్జెట్స్‌ను వ‌దిలి ఉండ‌లేని పేరెంట్స్ 76% ఉంటే, పిల్లలు 71% ఉన్నారు. త‌ల్లిదండ్రులు ఫోన్ల వినియోగాన్ని త‌గ్గించి ఆదర్శంగా నిలవకుండా, అర్థ‌వంత‌మైన బంధాల‌ను ఏర్పర‌చుకోనే విషయంలో త‌మ పిల్ల‌ల సామ‌ర్థ్యాల‌పై ఆందోళ‌న‌గా ఉన్న‌ట్టు స‌ర్వే తేల్చడం గ‌మ‌నార్హం.

News December 9, 2024

నా ఆనవాళ్లు చెరపాలనుకుంటారా?: KCR

image

TG: రాజకీయ స్వార్థం, తనపై కక్షతో కాంగ్రెస్ నేతలు పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయమని BRS అధినేత KCR అన్నారు. ‘నా ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖపుతనంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడం వెనక అసలు కోణం, ఉద్దేశం ఏదైనా వచ్చిన వారిని గౌరవించా. భోజనం పెట్టా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు నేను పునాది వేయలేదా? రైతుబంధు ప్రారంభించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.