News November 19, 2024
బంతి తగిలి అంపైర్‌కు తీవ్రగాయాలు
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ థర్డ్ గ్రేడ్ మ్యాచ్‌లో బంతి తగిలి అంపైర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పెర్త్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో బ్యాటర్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టడంతో బంతి నేరుగా అంపైర్ టోనీ డీనోబ్రెగా ముఖానికి తగిలింది. కన్ను, పెదవులతోపాటు చెంప కూడా వాచిపోయింది. ఆయన కన్ను పూర్తిగా మూసుకుపోయింది. ప్రస్తుతం టోనీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News November 19, 2024
పౌరసత్వాన్ని వదులుకొని..!
మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.
News November 19, 2024
దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.
News November 19, 2024
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్
AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.