News November 19, 2024

BGT కోసం భారత క్రికెటర్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్ పంత్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఆయన హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. కాగా ఈ నెల 22 నుంచి INDvsAUS మధ్య పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Similar News

News November 19, 2024

PSU, CPSE ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్

image

PSU, CPSE షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా? అయితే మీకో శుభవార్త! ఈ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడి అందించేందుకు ప్రభుత్వం సరికొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. ఇకపై ఏటా పన్నేతర ఆదాయంలో 30% లేదా కంపెనీ నెట్‌వర్త్‌లో 4% విలువకు సమానంగా డివిడెండ్ ఇవ్వాలని ఆదేశించింది. వరుసగా 6 నెలలు షేర్ల ధర బుక్‌వ్యాలూ కన్నా తక్కువగా ఉండి, కంపెనీ నెట్‌వర్త్ రూ.3000CR, నగదు రూ.1500CR ఉంటే బయ్‌బ్యాక్ చేయొచ్చని తెలిపింది.

News November 19, 2024

విశాఖలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

AP: విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి కాపాడారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్‌ను అరెస్టు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోంమంత్రి అనిత ఆదేశించారు.

News November 19, 2024

TTDలో ఇక హిందూ ఉద్యోగులే..

image

AP: టీటీడీలో 7వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా అందులో 300 మంది అన్యమతస్థులు (హిందువులు కాని వారు) ఉన్నారు. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం వీరిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపుతారు. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(5) సమ్మతిస్తుంది. కాగా టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. TTD తాజా నిర్ణయంపై మీ కామెంట్?