News November 19, 2024
ఎంత పని చేశావయ్యా బైడెన్!
తాను గెలిస్తే యుద్ధాలు ఆపేస్తానని కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కానీ మరో 60 రోజుల్లో కుర్చీ నుంచి దిగిపోనున్న బైడెన్ పెద్ద చిచ్చే పెట్టారని అంతర్జాతీయ నిపుణులు ఫైరవుతున్నారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడమే దీనికి కారణం. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బైడెన్ చెప్పారు. ఒకవేళ మిస్సైల్స్ ప్రయోగిస్తే రష్యా ఊరుకోదు.
Similar News
News November 19, 2024
త్వరలో భారత పర్యటనకు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వెల్లడించారు. అయితే కచ్చితమైన తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పుతిన్ పర్యటన దోహదపడనుంది. ఇటీవల బ్రిక్స్ సదస్సు కోసం మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
News November 19, 2024
కాంగ్రెస్ సంబరాలపై నవ్వుకుంటున్నారు: ఈటల
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్‌లో ప్రభుత్వం జరుపుకుంటున్న ఏడాది సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చకు ప్రధాని అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని చెప్పారు.
News November 19, 2024
YCP వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది: చంద్రబాబు
AP: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు దానిని మళ్లీ నిర్మించాలంటే రూ.990 కోట్లు అవసరమని చెప్పారు. ‘గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు చేశాం. కానీ వైసీపీ ఐదేళ్లలో 3.8 శాతం పనులే చేసింది. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.