News November 19, 2024

ఎంత పని చేశావయ్యా బైడెన్!

image

తాను గెలిస్తే యుద్ధాలు ఆపేస్తానని కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కానీ మరో 60 రోజుల్లో కుర్చీ నుంచి దిగిపోనున్న బైడెన్ పెద్ద చిచ్చే పెట్టారని అంతర్జాతీయ నిపుణులు ఫైరవుతున్నారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు పర్మిషన్ ఇవ్వడమే దీనికి కారణం. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బైడెన్ చెప్పారు. ఒకవేళ మిస్సైల్స్ ప్రయోగిస్తే రష్యా ఊరుకోదు.

Similar News

News April 18, 2026

ఈ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు అత్యధిక FD రేట్లు!

image

మూడేళ్ల టెన్యూర్‌కుగాను సీనియర్ సిటిజన్లకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 8% ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఇక ప్రైవేట్‌లో బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ 7.75%, RBL 7.70% వడ్డీని అందిస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 7%తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 6.80%తో పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI ఉన్నాయి.

News April 18, 2026

అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

image

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.

News April 18, 2026

NEET అభ్యర్థులకు అలర్ట్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మే 3న దేశవ్యాప్తంగా NEET UG-2026 జరగనుంది. 2PM నుంచి 5PM వరకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాలని, లేదంటే అనుమతించబోమని NTA తెలిపింది. ఫుల్ స్లీవ్స్ ధరించవద్దని, లైట్, సింపుల్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలని సూచించింది. వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పేర్కొంది.