News November 19, 2024
కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 19, 2024
కొడంగల్ ఏమైనా పాక్ సరిహద్దుల్లో ఉందా?: కేటీఆర్
లగచర్ల ఘటనలో వాస్తవాలను తొక్కిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో ఆరోపించారు. ‘లగచర్లకు పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ కిరాతకం ఢిల్లీకి చేరింది. మీ అరాచకపర్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. లగచర్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.
News November 19, 2024
US ఎలక్షన్స్: ద్రవ్యోల్బణమే ట్రెండింగ్ టాపిక్
US అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచినట్లు గూగుల్ వేవ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే 114% అధికంగా దీని గురించే సెర్చ్ చేశారని తెలిపింది. ఆ తర్వాత పెన్షన్ ఫండ్స్(76%), బడ్జెట్ లోటు(39%) అంశాలు ఉన్నాయంది. రేసిజం, స్టూడెంట్ లోన్స్, గన్ కంట్రోల్‌పై చర్చ బాగా తగ్గిందని పేర్కొంది. 2020లో ఎలక్ట్రోరల్ ఫ్రాడ్, 2016లో ఒపీనియన్ పోల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
News November 19, 2024
జీవో 16తో ఎంతమంది రెగ్యులరైజ్ అయ్యారంటే?
TG:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన GO 16ను <<14652442>>హైకోర్టు <<>>కొట్టేసింది. ఈ GO ప్రకారం మొత్తం 5,544 మంది రెగ్యులరైజ్ కాగా ఇందులో 2909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కాగా, టెక్నికల్ విద్యాశాఖలో 131 మంది, మెడికల్‌లో 837 మంది, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, మిగతావారు ఫార్మాసిస్టులు, సహాయకులు ఉన్నారు.