News November 19, 2024
కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్
ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 14, 2024
ఇకనైనా నాణ్యమైన భోజనం పెట్టండి: KTR
TG: బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన ట్వీట్ చేశారు. కెమెరాల ముందు హంగామా చేయకుండా గురుకుల బిడ్డల గుండె చప్పుడు వినాలని సూచించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ ఉంటే కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ నెలకొందని విమర్శించారు.
News December 14, 2024
అమరావతిలో మరో రూ.20వేల కోట్లతో అభివృద్ధి: నారాయణ
AP: అమరావతిలో మరో ₹20వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే ₹21వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో రూ.20వేల కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
News December 14, 2024
జీవో 317 సమస్యను పరిష్కరించండి: ఉపాధ్యాయులు
TG: జీవో 317 సమస్యను పరిష్కరించి తమను సొంత జిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా తమను బదిలీ చేయాలని కోరారు. HYDలోని ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద పలువురు ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని విన్నవించారు.