News November 19, 2024
రైల్వే స్టేషన్లో రద్దీని తలపించిన విమానాశ్రయాలు!
పండగల వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎలా కిటకిటలాడతాయో ఓసారి గుర్తు చేసుకోండి! NOV 17న దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పరిస్థితి ఇదేనంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆరోజు ఏకంగా 5.05లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజుల్లో చోటు సరిపోక చాలామంది కిందే కూర్చున్నారు. ఇక టికెట్ కౌంటర్లు, ₹400 ఖరీదైన దోసెల క్యూలైన్ ఆగిందే లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫెస్టివ్, వెడ్డింగ్ సీజన్ కావడమే దీనికి కారణం.
Similar News
News November 19, 2024
యువకుడిలా మారే యత్నం.. ముఖం ఎలా మారిందో చూడండి
యువకుడిగా కనిపించేందుకు(యాంటీ ఏజింగ్) ఏటా రూ.కోట్లు ఖర్చుచేస్తున్న US మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) <<13026727>>ప్రయోగం<<>> మలుపు తిరిగింది. ఓ దాత ఇచ్చిన ఫ్యాట్‌ను ముఖంపైన ఇంజెక్ట్ చేసుకోగా ఫేస్ వాచిపోయి అందవిహీనంగా తయారైంది. 7 రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని అతను తెలిపారు. ఇకపైనా ప్రయోగాలు కొనసాగిస్తానన్నారు. ఏదైనా ప్రొడక్ట్‌ను తయారుచేయడం, మనమే ఆ ప్రొడక్ట్‌గా ఉండటం భిన్నమైన విషయాలన్నారు.
News November 19, 2024
World Workforce: 20% మనోళ్లే!
ప్రపంచ కార్మిక శక్తిలో భారత్ కీలకపాత్ర పోషించనుంది. 2023-50 మధ్య కాలంలో అత్యధికంగా 20% వర్క్‌ఫోర్స్‌ను కంట్రిబ్యూట్ చేయనున్నట్టు Angel One Wealth అంచనా వేసింది. అదే సమయంలో చైనా నిష్పత్తి తగ్గే పరిస్థితి ఉందని పేర్కొంది. భారత్‌లో అధిక ఆదాయ కుటుంబాల సంఖ్య 2030కి మూడింతలయ్యే అవకాశం ఉందని, ఇది వ్యక్తిగత ఆదాయ వృద్ధి దేశాల్లో భారత్‌ను ముందువరుసలో నిలుపుతుందని వివరించింది.
News November 19, 2024
ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్
ఈరోజు ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయింది. యూజర్ల నుంచి 1500కి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఆన్‌లైన్ గ్లిచ్ పరిశీలన సంస్థ డౌన్‌డిటెక్టర్ తెలిపింది. 41శాతంమంది వినియోగదారులకు లాగిన్‌లో, మరో 41శాతంమంది సర్వర్ కనెక్షన్లలో ఇబ్బందులెదురైనట్లు పేర్కొంది. యాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నామని, మీడియా అప్‌లోడ్ చేయలేకపోతున్నామని అనేకమంది మెటాకు రిపోర్ట్ చేశారు.