News November 19, 2024
రైల్వే స్టేషన్లో రద్దీని తలపించిన విమానాశ్రయాలు!
పండగల వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎలా కిటకిటలాడతాయో ఓసారి గుర్తు చేసుకోండి! NOV 17న దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పరిస్థితి ఇదేనంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆరోజు ఏకంగా 5.05లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజుల్లో చోటు సరిపోక చాలామంది కిందే కూర్చున్నారు. ఇక టికెట్ కౌంటర్లు, ₹400 ఖరీదైన దోసెల క్యూలైన్ ఆగిందే లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫెస్టివ్, వెడ్డింగ్ సీజన్ కావడమే దీనికి కారణం.
Similar News
News December 12, 2024
EPFO ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్
EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.
News December 12, 2024
డిసెంబర్ 14న మహారాష్ట్ర క్యాబినెట్ విస్తరణ!
తర్జనభర్జనల అనంతరం మహాయుతిలో CM అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చింది. అయితే మంత్రివర్గ విస్తరణలో పీఠముడి వీడడం లేదు. కీలక శాఖల కోసం మిత్రపక్షాలు పట్టుబడుతున్నాయి. మధ్యేమార్గంగా మీకది-మాకిది అన్నట్టుగా శాఖలు పంచుకోవాలని నిర్ణయించాయి. 42 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండడంతో మొత్తంగా BJPకి 21-22, శివసేనకి 12-13, NCPకి 7-8 దక్కవచ్చు. Dec 14న విస్తరణ ఉంటుందని సమాచారం.
News December 11, 2024
SHOCKING: ప్రపంచంపైకి మరో మహమ్మారి?
కరోనా మహమ్మారి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో చూశాం. చైనాలోని ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీకైందన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన పలు వైరస్‌లు మిస్ కావడం కలకలం రేపుతోంది. హెండ్రా వైరస్, లిస్సా వైరస్, హంటా వైరస్ వంటివి వాటిలో ఉన్నాయని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.