News November 19, 2024

US ఎలక్షన్స్: ద్రవ్యోల్బణమే ట్రెండింగ్ టాపిక్

image

US అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచినట్లు గూగుల్ వేవ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే 114% అధికంగా దీని గురించే సెర్చ్ చేశారని తెలిపింది. ఆ తర్వాత పెన్షన్ ఫండ్స్(76%), బడ్జెట్ లోటు(39%) అంశాలు ఉన్నాయంది. రేసిజం, స్టూడెంట్ లోన్స్, గన్ కంట్రోల్‌పై చర్చ బాగా తగ్గిందని పేర్కొంది. 2020లో ఎలక్ట్రోరల్ ఫ్రాడ్, 2016లో ఒపీనియన్ పోల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

Similar News

News November 19, 2024

ఏపీలో మరో 4 కార్పొరేషన్లు ఏర్పాటు

image

AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.

News November 19, 2024

రేప‌టి నుంచి Bank Niftyలో అవి క‌నిపించ‌వు

image

రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్‌ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్‌లోనే వీక్లీ డెరివేటివ్‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఎక్స్‌ఛేంజ్‌లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్‌ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్‌లో Monthly Derivatives మాత్ర‌మే ఉంటాయి.

News November 19, 2024

రైల్వే ప్రయాణికులకు GOOD NEWS

image

ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1,000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో 10వేలకు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్‌లను ప్రవేశపెడతామంది. ఇందులో 4వేల స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని పేర్కొంది.