News November 19, 2024
రుణమాఫీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
TG: రూ.2లక్షలలోపు రుణమాఫీ రైతులందరికీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ హనుమకొండ సభలో వెల్లడించారు. ‘సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. సమస్యలు పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు కేటాయించాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2లక్షలలోపు రుణమాఫీ నిధులు విడుదల చేశాం’ అని చెప్పారు.
Similar News
News November 29, 2024
ఆశ్రమ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, బంగాళదుంపలు
TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేయగా కుళ్లిన గుడ్లు, ఆలుగడ్డలు కనిపించాయి. పప్పునకు బదులు సాంబార్ వండారని, ఉప్పు ప్యాకెట్లపై ISI మార్క్ లేదని గుర్తించారు. విద్యార్థులకు బ్లాంకెట్లు, యూనిఫామ్ ఇంకా అందలేదని తెలియడంతో వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.
News November 29, 2024
BREAKING: ‘లగచర్ల’ భూసేకరణ రద్దు
TG: లగచర్ల వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూసేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం 632 ఎకరాల భూసేకరణకు ప్రయత్నించిన అధికారులపై ప్రజలు తిరగబడటంతో వివాదం మొదలైంది. పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
News November 29, 2024
దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీపై ప్రభుత్వం ప్రకటన
TG: దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ వివరాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఆ కంపెనీకి BRS హయాంలోనే అనుమతులు ఇచ్చి, ప్రజలను మోసం చేశారని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతులు ఇచ్చిందని, వాటిని BRS పట్టించుకోలేదంది. ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తులకు గత మంత్రివర్గం అనుమతులు ఇచ్చిందని చెప్పింది. 2022 అక్టోబర్ 22న లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని పేర్కొంది.