News November 19, 2024
రుణమాఫీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
TG: రూ.2లక్షలలోపు రుణమాఫీ రైతులందరికీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ హనుమకొండ సభలో వెల్లడించారు. ‘సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. సమస్యలు పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు కేటాయించాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2లక్షలలోపు రుణమాఫీ నిధులు విడుదల చేశాం’ అని చెప్పారు.
Similar News
News December 5, 2024
నేడు ప్రోబా-3 ప్రయోగం
AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.
News December 5, 2024
EWS కోటాలో కాపులకు సగం సరికాదు: హైకోర్టు
AP: EWS 10% కోటాలో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కాపులకు 5% కోటా అమలు చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పలువురు సవాల్ చేశారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు JAN29కి వాయిదా వేసింది.
News December 5, 2024
ఈ 7 అలవాట్లు మీకు ఉన్నాయా?
జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని విషయాలను అలవర్చుకోవాలి. లేదంటే పురోగతి సాధించలేరు. నెగటివ్‌గా ఆలోచించేవారు వెంటనే దానిని వదిలించుకోవాలి. ఇతరులతో పోల్చుకుని నిరాశ పడకూడదు. గతాన్ని తలచుకుని వర్తమానాన్ని వదిలేస్తే ఎందుకూ పనికిరారు. సోమరితనాన్ని వదిలేస్తేనే లక్ష్యాల్ని సాధిస్తారు. ఒకరిపై అసూయ పడుతూ ఉంటే అక్కడే ఉండిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. భవిష్యత్ గురించి ఆందోళన పడకూడదు.