News November 19, 2024

World Workforce: 20% మనోళ్లే!

image

ప్ర‌పంచ కార్మిక శ‌క్తిలో భార‌త్ కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. 2023-50 మ‌ధ్య కాలంలో అత్య‌ధికంగా 20% వ‌ర్క్‌ఫోర్స్‌ను కంట్రిబ్యూట్ చేయ‌నున్న‌ట్టు Angel One Wealth అంచ‌నా వేసింది. అదే సమయంలో చైనా నిష్ప‌త్తి త‌గ్గే ప‌రిస్థితి ఉంద‌ని పేర్కొంది. భార‌త్‌లో అధిక ఆదాయ కుటుంబాల సంఖ్య 2030కి మూడింత‌లయ్యే అవ‌కాశం ఉంద‌ని, ఇది వ్య‌క్తిగ‌త ఆదాయ వృద్ధి దేశాల్లో భార‌త్‌ను ముందువ‌రుస‌లో నిలుపుతుంద‌ని వివ‌రించింది.

Similar News

News November 20, 2024

దేవుడిలా వచ్చి.. వేల మందిని కాపాడి!

image

తేలు కాటుకు ఒకప్పుడు విరుగుడు లేకపోవడంతో ఎంతో మంది చనిపోయేవారు. ముఖ్యంగా MHలోని గ్రామీణ ప్రాంతాల్లో 1980లలో మరణాలు పెరగడంతో డా.హిమ్మత్రావ్ బావస్కర్ బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఆయన కొత్త మిషన్ ప్రారంభించి తేలు చికిత్సపై ప్రయోగాలు చేసి ఫలితం సాధించారు. దీనిని వైద్యులకూ నేర్పించడంతో ప్రజల జీవితాలు మారిపోయాయి. తేలు కాటు మరణాలు 40% నుంచి 1శాతానికి తగ్గాయి. ఆయనను 2022లో పద్మశ్రీ వరించింది.

News November 20, 2024

గెరాల్డ్ కోయెట్జీకి ఐసీసీ హెచ్చరిక

image

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. ఆఖరి టీ20లో తన బౌలింగ్‌లో అంపైర్ వైడ్ ఇచ్చినప్పుడు కోయెట్జీ అసహనం వ్యక్తం చేశారు. అభ్యంతరకర భాషలో అంపైర్‌ను దూషించారంటూ ఫిర్యాదు నమోదైంది. దీంతో అధికారిక హెచ్చరికతో పాటు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పును కోయెట్జీ అంగీకరించారని తెలిపాయి.

News November 20, 2024

లెబనాన్‌లో 200 మంది చిన్నారుల మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు చేసిన అటాక్స్‌లో 200 మందికి పైగా చిన్నారులు మరణించారని, 1,100 మంది పిల్లలు గాయపడ్డారని UNICEF వెల్లడించింది. 2 నెలలుగా రోజుకు ముగ్గురు చొప్పున చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించగా, ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడుల్లో మొత్తం 3,510 మంది పౌరులు చనిపోయారు.