News November 19, 2024

World Workforce: 20% మనోళ్లే!

image

ప్ర‌పంచ కార్మిక శ‌క్తిలో భార‌త్ కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. 2023-50 మ‌ధ్య కాలంలో అత్య‌ధికంగా 20% వ‌ర్క్‌ఫోర్స్‌ను కంట్రిబ్యూట్ చేయ‌నున్న‌ట్టు Angel One Wealth అంచ‌నా వేసింది. అదే సమయంలో చైనా నిష్ప‌త్తి త‌గ్గే ప‌రిస్థితి ఉంద‌ని పేర్కొంది. భార‌త్‌లో అధిక ఆదాయ కుటుంబాల సంఖ్య 2030కి మూడింత‌లయ్యే అవ‌కాశం ఉంద‌ని, ఇది వ్య‌క్తిగ‌త ఆదాయ వృద్ధి దేశాల్లో భార‌త్‌ను ముందువ‌రుస‌లో నిలుపుతుంద‌ని వివ‌రించింది.

Similar News

News March 9, 2026

ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News March 9, 2026

BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.