News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
Similar News
News November 20, 2024
Elections: వీరి ఆస్తులు రూ.2వేలే!
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అజయ్ భోజ్‌రాజ్, విజయ్ మనోహర్, అల్తాఫ్ సయ్యద్ తమ ఆస్తులు కేవలం రూ.2,000 అని అఫిడవిట్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పేద అభ్యర్థులుగా నిలిచారు. పరాగ్ షా(BJP) రూ.3,383 కోట్లతో రిచ్ కాండిడేట్‌గా ఉన్నారు. నిరక్షరాస్యులు 10, 5వ తరగతి 85, 8th 214, టెన్త్ 313, ఇంటర్ చదివిన వారు 422 మంది ఉన్నారు. PS: HT
News November 20, 2024
కెనడాలోని విదేశీ విద్యార్థులకు శుభవార్త
కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటును 24 గంటలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు చదువును కొనసాగిస్తూనే పార్ట్‌టైం ఉద్యోగాలు మరో 4 గంటలు ఎక్కువ చేసుకోవచ్చు. అయితే పని గంటలు పెరగడం చదువుపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
News November 20, 2024
48 గంటల్లోపే అకౌంట్లో డబ్బులు: మంత్రి
AP: ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రూ.418 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో, ప.గో, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రైతులు ఎప్పుడు, ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చని సూచించారు.