News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
Similar News
News April 19, 2026
HYD: అజ్జూ భాయ్ కోసం.. CM రేవంత్!

సీఎం రేవంత్ రెడ్డి నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ కానున్నారు. పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా MLCలు ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని ఆయన కోరనున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు ఈ నెలాఖరుతో ఆరు నెలల గడువు ముగియనుంది. ఈలోపు ఆయన ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి. ఒకవేళ గవర్నర్ ఆమోదం లభించకపోతే అజాహరుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.
News April 19, 2026
మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్‌వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.


