News November 20, 2024
Swiggy Instamartలో మోసపోయిన కస్టమర్!
Swiggy Instamartలో 400-600గ్రా. బరువున్నట్లు చూపించిన క్యాలిఫ్లవర్‌ను ఆర్డర్ పెడితే కేవలం 145గ్రాములే డెలివరీ అయిందని ఓ కస్టమర్ రెడ్డిట్‌లో పోస్టు చేశారు. తాను ఆర్డర్ పెట్టిన కూరగాయలన్నీ తక్కువ బరువున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా అక్కడా సంతృప్తికరమైన స్పందన రాలేదని వాపోయారు. ఫుల్ రిఫండ్‌కు బదులు ₹89 ఇస్తామని చూపించిందన్నారు. దీంతో Instamartలో ఆర్డర్లు పెట్టేవారు అలర్టయ్యారు.
Similar News
News November 20, 2024
పంత్‌తో ఆడాలంటే ప్లాన్ B, C అవసరం: హేజిల్‌వుడ్
ఇండియాతో ఫస్ట్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పంత్ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేయాలంటే బౌలర్ల వద్ద ప్లాన్ B, C కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి అతడిని అడ్డుకోవడంపై హేజిల్‌వుడ్ స్పందించారు. భారత జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని జోష్ చెప్పారు.
News November 20, 2024
RECORD: బిట్‌కాయిన్ @ రూ.80లక్షలు
క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ రికార్డులను తిరగరాస్తోంది. తొలిసారి $94000ను టచ్ చేసింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.80లక్షలకు చేరువగా ఉంటుంది. క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ Bakktను డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ కొనుగోలు చేయనుందన్న వార్తలే దీనికి కారణం. పైగా ఆయన క్రిప్టో ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తారన్న అంచనాలూ పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. ప్రస్తుతం BTC $92000 వద్ద చలిస్తోంది.
News November 20, 2024
సింగిల్స్‌కు చైనా కంపెనీ బంపరాఫర్
సింగిల్‌గా ఉన్న తమ ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. షెన్ జెన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులు డేట్‌కు వెళ్తే నగదు బహుమతి ఇస్తోంది. కంపెనీలోని సింగిల్స్‌కు డేటింగ్ ఖర్చుల కోసం రూ.770 అందిస్తోంది. ఒకవేళ డేటింగ్లో ఉంటే ఇద్దరికీ చెరో రూ.11,650 ఇస్తోంది. పెళ్లిళ్లు చేసుకోకపోవడం, తద్వారా జనాభా తగ్గుతుండటంతో చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి కంపెనీలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.