News November 20, 2024
Swiggy Instamartలో మోసపోయిన కస్టమర్!
Swiggy Instamartలో 400-600గ్రా. బరువున్నట్లు చూపించిన క్యాలిఫ్లవర్‌ను ఆర్డర్ పెడితే కేవలం 145గ్రాములే డెలివరీ అయిందని ఓ కస్టమర్ రెడ్డిట్‌లో పోస్టు చేశారు. తాను ఆర్డర్ పెట్టిన కూరగాయలన్నీ తక్కువ బరువున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా అక్కడా సంతృప్తికరమైన స్పందన రాలేదని వాపోయారు. ఫుల్ రిఫండ్‌కు బదులు ₹89 ఇస్తామని చూపించిందన్నారు. దీంతో Instamartలో ఆర్డర్లు పెట్టేవారు అలర్టయ్యారు.
Similar News
News December 8, 2024
క్రికెట్ ఫ్యాన్స్‌కు SAD DAY
టీమ్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇవాళ బాధాకరమైన రోజుగా మిగిలింది. భారత జట్టు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పురుషుల జట్టు ఓటమి పాలైంది. AUSతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం చవిచూసింది. అండర్-19 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో యువ భారత్ ఓటమి పాలైంది. దీంతో ఈరోజు SAD DAY అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News December 8, 2024
శబరిమల వెళ్లే వారికి శుభవార్త
శబరిమల వెళ్లే వారి కోసం SCR 34 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరిలో తిరిగే ఈ రైళ్లు హైదరాబాద్-కొట్టాయం, కొట్టాయం-సికింద్రాబాద్, మౌలాలి-కొట్టాయం, కాచిగూడ-కొట్టాయం, మౌలాలి-కొల్లం మధ్య వివిధ తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. రైళ్లు ప్రయాణించే తేదీలు, హాల్టింగ్ వివరాలను పైన ఫొటోల్లో చూడవచ్చు.
News December 8, 2024
ఒక అరటిపండు.. రైలును ఆపేసింది!
బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 4వ ప్లాట్‌ఫామ్‌పై దొరికిన అరటిపండు కోసం రెండు కోతులు కొట్టుకున్నాయి. కోపంలో ఓ కోతి మరో కోతిపైకి రబ్బరు వస్తువును విసిరింది. అది కాస్తా ఓ విద్యుత్ వైరుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి వైరు ఊడి ఆగి ఉన్న రైలు బోగీపై పడింది. దీంతో ఆ స్టేషన్‌కి రైళ్ల రాకపోకలు గంటసేపు నిలిచిపోయాయి. ఇదంతా చేసిన కోతులు చక్కగా అరటిపండుతో పరారయ్యాయి.