News November 20, 2024
బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకు ఉండదు?
నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. బైకుల కోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక మార్గం ఉంటుంది. ఇతర వాహనాలతో పోల్చితే బైకుల సైజు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బైకులు బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇతర వాహనాలతో పోల్చితే రోడ్డుపై అధిక భారం పడదు.
Similar News
News November 27, 2024
ఒక్క ఛార్జ్‌తో 102KM: యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది
హోండా కంపెనీ భారత మార్కెట్లో Activa e ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 102KM వెళ్లడం దీని ప్రత్యేకత. స్టైలింగ్ విషయంలో కంపెనీ మినిమలిస్టిక్ అప్రోచ్ పాటించింది. ICE స్కూటర్ మోడల్‌నే అనుసరించింది. రెండు 1.5kWh బ్యాటరీలుండే ఈ స్కూటర్లో LED హెడ్‌లైట్‌కే ఇండికేటర్లు ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్ చిన్నగా సీటు పెద్దగా ఉంటాయి. ఇందులో స్టాండర్డ్, స్పోర్ట్, ఈకాన్ వేరియెంట్లు ఉన్నాయి.
News November 27, 2024
HIGH ALERT.. అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి NOV 30 వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
News November 27, 2024
డిసెంబర్ 3న ‘సంక్రాంతికి వస్తున్నాం’ లిరికల్ వీడియో
విక్టరీ వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ లిరికల్ వీడియోను డిసెంబర్ 3న విడుదల చేస్తామంది. భాస్కరభట్ల రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.