News November 20, 2024

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకు ఉండదు?

image

నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. బైకుల కోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక మార్గం ఉంటుంది. ఇతర వాహనాలతో పోల్చితే బైకుల సైజు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బైకులు బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇతర వాహనాలతో పోల్చితే రోడ్డుపై అధిక భారం పడదు.

Similar News

News December 12, 2024

ప్రభుత్వ దుబారా ఖర్చుల వల్లే ద్రవ్యోల్బణం: మస్క్

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రభుత్వాలు చేసే అధిక వ్యయమే ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ దుబారా ఖర్చులను అరికడితే ద్రవ్యోల్బణం ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలనే చూస్తున్నామని, ధరల పెరుగుదలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News December 12, 2024

నన్ను గొడ్డులా చావబాదేవాడు: అతుల్ భార్య

image

రూ.10 లక్షల వరకట్నం కోసం తనను తీవ్రంగా వేధించారని అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా ఆరోపించారు. తనకు వచ్చిన జీతం మొత్తం సుభాష్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారని 2022లో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపారు ‘సుభాష్, ఆయన తల్లిదండ్రులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాగొచ్చి గొడ్డును బాదినట్లు చావగొట్టేవారు. ఇదంతా చూసి తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో మరణించారు’ అని ఆమె పేర్కొన్నారు.

News December 12, 2024

T20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.