News November 20, 2024
యూపీ ఉప ఎన్నికల్లో హోరాహోరీ

యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అధికార బీజేపీ, విపక్ష ఎస్పీ మధ్య హోరాహోరీగా జరిగినట్టు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అధికార బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలుస్తుందని డీఎన్ఏ వెల్లడించింది. ఇక విపక్ష ఎస్పీ 3-5 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. SP నుంచి నలుగురు, BJP ముగ్గురు, RLD, నిషాద్ పార్టీ నుంచి ఒకరు MLAలుగా రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
Similar News
News April 17, 2026
పరిశ్రమలకు అనుమతులు వెంటనే ఇవ్వాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్సిడీలు ఇచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.
News April 17, 2026
మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్‌నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.


