News November 20, 2024
ఇన్వెస్టర్లకు నితిన్ కామత్ హెచ్చరిక

ట్రేడింగ్ పేరుతో నకిలీ యాప్, వెబ్‌సైట్‌ల ఆగడాలు పెరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను జిరోదా కో-ఫౌండర్ నితిన్ కామత్ హెచ్చరించారు. ఇలాంటి ఉదంతాల గురించి చదవని, వినని రోజంటూ లేదని పేర్కొన్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆత్రుతపడకుండా ఆయా వేదికలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మరీ ఆకర్షణీయ ప్రకటనలు కచ్చితంగా నకిలీవి అయ్యుంటాయని హెచ్చరించారు.
Similar News
News January 19, 2026
WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News January 19, 2026
పెట్టుబడుల వేటలో సీఎంలు!

దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల టార్గెట్ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మంత్రులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. CBN ఒకరోజు ముందే వెళ్లి పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ రేవంత్ కూడా తన బృందంతో వెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. లేటెస్ట్ పర్యటనలతో ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే చర్చ మొదలైంది.
News January 19, 2026
త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CBN

ఏపీలో ఈ ఏడాది డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్సులు తీసుకొస్తున్నట్లు CM CBN తెలిపారు. విశాఖకు రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని జూరిచ్ తెలుగు డయాస్పోరా మీటింగ్‌లో పేర్కొన్నారు. ‘NRIలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.50కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తాం. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తున్నాం’ అని చెప్పారు. బెస్ట్ వర్సిటీల్లో చదవాలనుకునే వారికి 4% వడ్డీతో రుణాలిస్తామన్నారు.


