News November 20, 2024

ఇన్వెస్టర్లకు నితిన్ కామ‌త్‌ హెచ్చరిక

image

ట్రేడింగ్ పేరుతో న‌కిలీ యాప్‌, వెబ్‌సైట్‌ల ఆగ‌డాలు పెరుగుతుండ‌డంతో జాగ్ర‌త్త‌గా ఉండాలని ఇన్వెస్ట‌ర్లను జిరోదా కో-ఫౌండ‌ర్ నితిన్ కామ‌త్ హెచ్చ‌రించారు. ఇలాంటి ఉదంతాల గురించి చ‌ద‌వ‌ని, విన‌ని రోజ‌ంటూ లేద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు ఆత్రుతపడకుండా ఆయా వేదికలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మరీ ఆక‌ర్ష‌ణీయ ప్ర‌క‌ట‌న‌లు క‌చ్చితంగా న‌కిలీవి అయ్యుంటాయ‌ని హెచ్చ‌రించారు.

Similar News

News December 6, 2024

చర్మంపై ముడతలా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి

image

యూత్‌ఫుల్ స్కిన్ ప్రతి ఒక్కరి కోరిక. వయసు పెరగడం, వాతావరణ మార్పులతో చర్మం ముడతలు పడటం సహజం. ఇలా కావొద్దంటే అసంతృప్త కొవ్వులుండే అవకాడో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇక విటమిన్ E నిగారింపు పెంచుతుంది. బ్లూ, బ్లాక్, స్ట్రా బెర్రీస్‌లోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. ఒమేగా 3 దొరికే అవిసెలు, చేపలు, విటమిన్స్, మినరల్స్ లభించే ఆకుకూరలు తీసుకోవాలి.

News December 6, 2024

ఆ ఊరిలో 60 ఏళ్లుగా మొబైల్, టీవీ లేవు!

image

మొబైల్, టీవీ లేకుండా చాలామందికి రోజు గడవదు. కానీ అమెరికాలోని వెస్ట్‌వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే ఊరిలో 60 ఏళ్లుగా టీవీ, సెల్ ఫోన్లను వాడటం లేదు. అందుకో కారణం ఉంది. అంతరిక్ష రేడియో తరంగాల అధ్యయనం కోసం 1958లో ఓ టెలిస్కోప్‌ను ఇక్కడ ప్రారంభించారు. ఫోన్లు, టీవీలు సహా ఫ్రీక్వెన్సీ కలిగిన పరికరాల్ని వాడితే ఆ తరంగాల వల్ల అధ్యయనం దెబ్బతింటుంది. అన్నట్లు.. అక్కడి జనాభా 141మంది మాత్రమే!

News December 6, 2024

రికార్డు సృష్టించిన బుమ్రా

image

టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒకే ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆయన నిలిచారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.