News November 20, 2024
చలి పెరుగుతోంది.. జాగ్రత్త: ప్రభుత్వం
TG: క్రమంగా చలి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలు, కార్మికులు, రైతులు, నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం కారడం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంది. ఈ మేరకు ఓ అడ్వైజరీ నోట్‌ను విడుదల చేసింది.
Similar News
News November 26, 2024
అనారోగ్యంపై గూగుల్‌లో చూడటమూ రోగమే!
అరచేతిలో నెట్ ఉండటంతో స్వల్ప అస్వస్థత కలిగినా గూగుల్‌ని అడగడం చాలామందికి పరిపాటిగా మారింది. అలా చూడటం కూడా సైబర్‌కాండ్రియా అనే మానసిక రుగ్మతేనంటున్నారు వైద్యులు. ఓ అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వాడేవారిలో 72శాతం మంది తమ ఆరోగ్య సమస్యలపై గూగుల్ చేస్తున్నారట. దీని వల్ల అపోహలతో ఆందోళనకు లోనయ్యే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య ఉంటే వైద్యులకు చూపించుకోవడం సరైనదని సూచిస్తున్నారు.
News November 26, 2024
పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జైనాబ్ రవ్‌డ్జీతో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటించారు. వారిద్దరిని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా వచ్చే నెల 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య కూడా శోభిత ధూళిపాళను వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
News November 26, 2024
21 ఏళ్లకే 195 దేశాలు చుట్టేసి రికార్డ్!
జీవితకాలంలో వేరే దేశాన్ని ఓసారి చూస్తే గొప్ప అనుకుంటాం. కానీ US యువతి లెక్సీ ఆల్ఫోర్డ్ 21 ఏళ్ల వయసుకే 195 దేశాలు చుట్టేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. తాజాగా విద్యుత్ కారులో ప్రపంచమంతా తిరిగిన తొలి వ్యక్తిగా మరో రికార్డునూ సృష్టించారు. కారులో 200 రోజుల పాటు 6 ఖండాలను దాటారు. తన తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా చేసేవారని, వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారామె.