News November 20, 2024
చలి పెరుగుతోంది.. జాగ్రత్త: ప్రభుత్వం
TG: క్రమంగా చలి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలు, కార్మికులు, రైతులు, నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం కారడం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలంది. ఈ మేరకు ఓ అడ్వైజరీ నోట్‌ను విడుదల చేసింది.
Similar News
News December 12, 2024
పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన APPSC
AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను మార్చి 16వ తేదీ ఉదయం 9.30 నుంచి మ.12 వరకు నిర్వహించనుంది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను మార్చి 17వ తేదీన ఉదయం 9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ కోసం ఇక్కడ <
News December 12, 2024
జమిలి ఎన్నికలకు డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. రేపు క్యాబినెట్ ముందుకు?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News December 12, 2024
EPFO ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్
EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.