News November 21, 2024
నేడు తెలంగాణకు రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.10 వరకు రాజ్ భవన్‌లో రెస్ట్ తీసుకుని, సా.7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం హైటెక్‌సిటీలోని శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.
Similar News
News November 22, 2024
ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం
ఈడెన్ గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరు పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈడెన్‌లో జరిగే IND-ENG మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈమె 2002-2022 మధ్య 204 ODIలు, 68 T20లు, 12 టెస్టులు ఆడి 355 వికెట్లు తీశారు. కాగా మాజీ క్రికెటర్లు గంగూలీ, పంకజ్ పేర్లతో మాత్రమే ఈడెన్‌లో స్టాండ్స్ ఉన్నాయి.
News November 21, 2024
అదానీపై అమెరికాలో కేసు ఎందుకు?
అదానీ ఇండియాలోని ప్రభుత్వాలకు, డిస్కంలకు లంచం ఇచ్చారని USలో కేసు నమోదవడం ఏంటి? వారెంట్ జారీ చేయడమేంటి? అనుకుంటున్నారా? తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారనేది అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినీతి మార్గంలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో తమ దేశ పౌరులతో ఇన్వెస్ట్ చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం ఆ దేశంలో చట్టవిరుద్ధం. అందుకే అక్కడ కేసు పెట్టారు.
News November 21, 2024
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా సంస్కరణలు: మంత్రి లోకేశ్
AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలుచేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ‘GOVT స్కూళ్లలో అడ్మిషన్లను పెంచడం, టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు యాప్‌ను తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను APతో పంచుకోవాలని WB ప్రతినిధులను కోరా’ అని ట్వీట్ చేశారు.