News November 21, 2024

నేడు తెలంగాణకు రాష్ట్రపతి ముర్ము

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.10 వరకు రాజ్ భవన్‌లో రెస్ట్ తీసుకుని, సా.7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం హైటెక్‌సిటీలోని శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.

Similar News

News December 14, 2024

అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!

image

జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.

News December 14, 2024

హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.

News December 14, 2024

గురుకులాల ఇమేజ్ పెంచుతాం: సీఎం రేవంత్

image

TG: గురుకులాల్లో చదివిన వారు ప్రతిష్ఠాత్మక పదవులు చేపట్టారని CM రేవంత్ అన్నారు. గురుకుల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. చిలుకూరులో జరిగిన ‘గురుకులాల బాట’లో CM మాట్లాడారు. ‘ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువనే అపోహ ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లకు కామన్ డైట్ రూపొందించాం. గురుకులాలను ప్రక్షాళన చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.